LIC | ఎల్ఐసీ.. భారతీయ జీవిత బీమా సంస్థ.. కోట్ల మందికి ఓ భరోసా.. కానీ ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నది. గత నెల 17న దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన దగ్గర నుంచి ఎల్ఐసీ షేర్ ఒత్తిడికి గురవుతున్నది. సోమవారం బీఎస్ఈ ట్రేడింగ్లో రెండు శాతం నష్టపోయి ఎల్ఐసీ షేర్ రూ.786.05 వద్దకు పడిపోయింది. ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన దగ్గర నుంచి ఆఫర్ ధర కంటే తక్కువ ఇది.
గత నెల 17న దేశీయ స్టాక్మార్కెట్లలో లిస్టింగ్ సమయంలో సెబీ ఆఫర్ చేసిన షేర్ విలువ రూ.949. తొలి రోజే ఎల్ఐసీ షేర్ 8 శాతం నష్టంతో లిస్టయింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎల్ఐసీ షేర్ విలువ 17 శాతం నష్టపోయింది. వరుసగా ఐదో రోజు ఆరు శాతం నష్టంతో ట్రేడయింది.
ఫలితంగా ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. రూ.20.557 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీవోకు వెళ్లిన ఎల్ఐసీ షేర్లు 2.95 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.905లకు షేర్, ఎల్ఐసీ పాలసీదారులకు రూ.889లకు వాటాలు కేటాయించారు.