Lexus LM 350h | జపాన్ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) తన పాపులర్ లగ్జరీ ఎంపీవీ కారు లెక్సస్ ఎల్ఎం 350హెచ్ (Lexus LM 350h) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. లెక్సస్ ఎల్ఎం 350హెచ్ కారు లెక్సస్ ఫ్లాగ్ షిప్ మోడల్ కారు. దేశంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ). లెక్సస్ ఎల్ఎం 350హెచ్ రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. రెండు వేరియంట్లు సెవెన్ సీటర్, ఫోర్ సీటర్లుగా అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
టయోటా వెల్ఫైర్ (Toyota Velfire) నుంచి రూపుదిద్దుకున్న లెక్సస్ ఎల్ఎం 350 హెచ్.. జీఏ-కే మాడ్యులర్ ప్లాట్ ఫామ్ వేదికగా డిజైన్ చేశారు. స్ట్రైకింగ్ స్పిండిల్ గ్రిల్లె, స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇన్నోవేటివ్ ఫాగ్ ల్యాంప్స్, ఎంబాడింగ్ సెన్స్ ఆఫ్ ఎక్స్ట్రావేగేంజ్ ఫ్రం ఎవ్రీ యాంగిల్ తదితర ఫీచర్లు ఉంటాయి. లెక్సస్ ఎల్ఎం లో ఎల్ఎం అంటే లగ్జరీ మూవర్ అని అర్థం. ఫోర్ సీటర్ వేరియంట్ కారులో ప్రీమియం సౌకర్యాలు ఉంటాయి. ప్రధానంగా ఫ్రంట్ అండ్ రేర్ ప్యాసింజర్స్, ఎయిర్ క్రాఫ్ట్ రీక్లైనర్ సీట్లు, 23-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఫోల్డ్ ఔట్ టాబ్లెట్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్స్, యూఎస్బీ పోర్ట్స్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు. 2.5 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ – హైబ్రీడ్ ఇంజిన్ (246 బీహెచ్పీ విద్యుత్, 239 ఎన్ఎం టార్క్) ఈ-సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, కంట్రోల్ ఆన్ వ్యారీ టెర్రైన్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
నిరంతర ప్రయాణ క్వాలిటీ కోసం అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్, ప్రయాణికుల ప్రాధాన్యాలకు అనుగుణంగా సెన్సర్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికులకు మన:శాంతి కలిగించే లెక్సస్ సేఫ్టీ సిస్టమ్ + 3 అడాస్ సూట్ తదితర ఫీచర్లు ఉంటాయి. గతేడాది బుక్ చేసుకున్న వారికి లెక్సస్ తన లెక్సస్ ఎల్ఎం 350 హెచ్ కారు డెలివరీ చేస్తుంది. మెర్సిడెజ్ మే బ్యాక్ జీఎల్ఎస్, బెంట్లీ బెంటాయ్గా వంటి కార్లతో పోటీ పడుతుంది. భారత్ లోని ఎంపీవీ సెగ్మెంట్ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నదీ లెక్సస్ ఎల్ఎం 350హెచ్ కారు.