Tax Savings | టైం డిపాజిట్ నుంచి పీపీఎఫ్ వరకు.. ఈ పోస్టాఫీసు పథకాలపై పన్ను రాయితీలు ఇలా.. !
Tax Savings | మీ ఆదాయంపై పన్ను ఆదాతోపాటు మెరుగైన రిటర్న్స్ పొందాలంటే పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్, పీపీఎఫ్, సుకన్య, టైం డిపాజిట్ స్కీం వంటి పథకాలు ఉన్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను రాయితీ పొందొచ్చు.
Tax Savings | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసిపోతున్నది. మీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్‌లో పన్ను డిడక్షన్ క్లయిమ్ చేయాలంటే ఈ నెలాఖరు లోపే పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటి వరకు పెట్టుబడులు మదుపు చేయలేదా.. అయితే ఈ నెల 31 లోపు అందుకు మెరుగైన పెట్టుబడి ఆప్షన్ గల పథకాలు.. ఐదు పోస్టాఫీసు పథకాలతోపాటు పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), టైం డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాలు ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడులతో పన్ను ఆదా చేయడంతోపాటు మంచి రిటర్న్స్ పొందొచ్చు. వాటి గురించి తెలుసుకుందామా.. !
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంపై 8 శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంపై 8 శాతం వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. 60 ఏండ్లు దాటిన వారు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ఈ అకౌంట్ తెరవవచ్చు. ఒకవేళ 55 ఏండ్ల తర్వాత ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుంటే 60 ఏండ్ల లోపు వయస్సు గల వారైనా ఖాతా తెరవచ్చు. ఈ ఖాతా కింద ఐదేండ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మెచ్యూరిటీ గడువు తీరిన తర్వాత మూడేండ్ల వరకు పొడిగించవచ్చు. ఈ స్కీం కింద గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ
పదేండ్లలోపు బాలికల పేరిట ఈ పథకం కింద ఖాతా తెరవచ్చు. రూ.250 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద మదుపు చేసిన మొత్తంపై ఏటా 7.6 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్‌పై కంటే ఎక్కువ. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీసులో గానీ, ఆథరైజ్డ్ బ్యాంక్ శాఖలో గానీ ఈ ఖాతా తెరవచ్చు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)పై వడ్డీ ఆదాయం ఎంతంటే?!
పోస్టాఫీసు పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాల్లో డిపాజిట్లపై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ ఆదాయం లభిస్తున్నది. వార్షిక ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. ఇది ప్రతి యేటా అసలుతో కలిపేస్తారు. పీపీఎఫ్ స్కీం ఈఈఈ క్యాటగిరీ కింద మినహాయింపు కోరవచ్చు. రిటర్న్స్‌పై ఆదాయం, మెచ్యూరిటీ మొత్తం, వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 15 ఏండ్ల పాటు పీపీఎఫ్ ఖాతా తెరిచి ఉంచాలి. అటుపై మరో ఐదేండ్లు పొడిగించవచ్చు. కనీసం రూ.500తో పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో ఏడు శాతం వడ్డీ
పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ) కింద పెట్టుబడిపై ఏటా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. వార్షిక ప్రాతిపదికన వడ్డీ ఆదాయం లెక్కిస్తారు. కానీ, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ముగిసిన తర్వాతే వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. ఎన్ఎస్సీ ఖాతా ఓపెన్ చేయడానికి కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేని పథకం ఇది.
టైమ్ డిపాజిట్ స్కీంపై నికరమైన రిటర్న్స్
పోస్టాఫీసు టైం డిపాజిట్ ఖాతా.. ఒక తరహా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం. ఇందులో నిర్దిష్ట గడువులో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. హామీతో కూడిన రిటర్న్స్, వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ పథకంపై ఏడాది నుంచి ఐదేండ్లలో 5.5 నుంచి ఏడు శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. పోస్టాఫీసులో ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. ఐదేండ్ల గడువుతో డిపాజిట్ చేస్తే ఏటా ఏడు శాతం వడ్డీ పొందొచ్చు. కనీసం రూ.1000 పెట్టుబడి నుంచి గరిష్టంగా అపరిమిత పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ప్రతి యేటా మొత్తం మీ ఆదాయంలో రూ.1.5 లక్షల వరకు పన్ను డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

