హైదరాబాద్, జూన్ 21: ప్రముఖ టైర్ల సంస్థ జేకే టైర్..కమర్షియల్ వాహనాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి మరో నాలుగు టైర్లను విడుదల చేసింది.
ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ అనుజ్ కథూరియా మాట్లాడుతూ.. అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఈ టైర్లతో కమర్షియల్ వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుముఖం పట్టనున్నాయని, ఈ నూతన శ్రేణి టైర్లను రూపొందించడానికి మైసూరులో రూ.600 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఆర్అండ్డీ కోసం ప్రతియేటా రూ. 120 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.