హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ మరో రూ.4,205.94 కోట్ల విలువైన మూడు ఆర్డర్లు దక్కించుకున్నది. ఈ ఆర్డర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి లభించినట్టు సంస్థ పేర్కొంది.
వీటిలో నీటి విభాగం నుంచి రూ.819.20 కోట్ల ఆర్డర్ రాగా, ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి రూ.173.19 కోట్లు, అలాగే రవాణా డివిజన్ నుంచి రూ.3,213.55 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చినట్టు పేర్కొంది. వీటిలో రూ.3,213.55 కోట్ల విలువైన ఆర్డర్ జే కుమార్-ఎన్సీసీ సంయుక్తంగా చేపడుతున్న భారీ ప్రాజెక్టు నుంచి లభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.