Lava Blaze Duo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) భారత్ మార్కెట్లో త్వరలో తన లావా బ్లేజ్ డ్యూ (Lava Blaze Duo) ఫోన్ ఆవిష్కరించనున్నది. ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభించనున్న లావా బ్లేజ్ డ్యూ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా విక్రయిస్తారు.
ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో లావా బ్లేజ్ డ్యూ (Lava Blaze Duo) ఆవిష్కరిస్తారని అమెజాన్ మైక్రో సైట్ వెల్లడించింది. లావా బ్లేజ్ డ్యూ ఫోన్ డ్యుయల్ డిస్ ప్లేలు కలిగి ఉంటుంది. రేర్ ప్యానెల్ పై చిన్న రెక్టాంగులర్ సెకండరీ స్క్రీన్ ఉంటుంది. లావా బ్లేజ్ డ్యూ ఫోన్ 6.67 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ మెయిన్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1.58 అంగుళాల సెకండరీ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.