Lava Agni 3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. త్వరలో తన లావా అగ్ని 3 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్, రెండు కలర్ ఆప్షన్లతోపాటు 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. అక్టోబర్ నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లావా అగ్ని 3 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారు.
లావా అగ్ని3 5జీ ఫోన్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 పలుకుతుందని భావిస్తున్నారు. విరిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.