SBI Home Loans | ఎస్బీఐ వివిధ వర్గాల అవసరాలను బట్టి హోంలోన్ల వడ్డీరేట్లను ఖరారు చేసింది. సమాజంలోని వివిధ వర్గాల వారు హోంలోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే, వారి సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణం మంజూరు చేస్తుంటాయి. సిబిల్ స్కోర్ 300-900 మధ్య త్రి-డిజిట్ సమ్మరీని బట్టి రేటింగ్, వడ్డీరేట్లు ఖరారవుతాయి.
ఫ్లెక్సీ పే, ఎన్నారై హోంలోన్, నాన్ శాలరీడ్ లోన్లు, డిఫరెన్షియల్ ఆఫరింగ్, ప్రివిలైజ్, శౌర్య, అప్నాఘర్ వంటి స్కీమ్‌ల్లో ఎస్బీఐ ఇంటి రుణాలిస్తున్నది. రెపోరేట్‌ను బట్టి ఎస్బీఐ హోంలోన్లపై వడ్డీరేట్లు ఖరారవుతాయి. రెగ్యులర్ హోం లోన్స్, సీఆర్ఈ హోంలోన్లు, టాపప్ లోన్లు, రియాల్టీ లోన్లు, ట్రైబల్ ప్లస్, పీ-లాప్ రుణాలు ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నది. మహిళా రుణ గ్రహీతలకు వడ్డీరేటులో ఐదు బేసిక్ పాయింట్ల రాయితీ కల్పిస్తున్నది. అయితే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఆర్) కనిష్టంగా 6.65 శాతం ఉంటుంది.
లోన్ టు కాస్ట్ నిష్పత్తి ప్రకారం రూ.30 లక్షల ఇండ్ల రుణాలపై 10 బీపీఎస్ ప్రీమియం వడ్డీ వసూలు చేస్తారు. రూ.20 లక్షలు- రూ.2 కోట్ల మధ్య రుణాలపై టాప్ లోన్లను అనుమతించడం లేదు. ఎస్బీఐలో వేతన ఖాతా నిర్వహిస్తున్న వారికి శౌర్య, అప్నాఘర్ స్కీంల కింద 5 బీపీఎస్ పాయింట్లు వడ్డీరేట్ రాయితీనిస్తారు. ఎస్బీఐ ఖాతా కల వినియోగదారుల ఇంటి రుణాలపై టాప్ అప్ రుణంపై వడ్డీరేటు. .హోంలోన్ కంటే తక్కువ ఉండదు.