IT Returns | వేతన జీవులూ పారా హుషార్.. సమీపిస్తున్న ఐటీరిటర్న్స్ గడువు
IT Returns | వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది.
IT Returns | గత ఆర్థిక సంవత్సర (2021-22) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించే గడువు సమీపిస్తున్నది. ఈ నెలాఖరులోగా వేతన జీవులు, వ్యాపారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు తమ ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా ఐటీ రిటర్న్స్ సమర్పించకుంటే ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. జరిమానా చెల్లించకుండా ఐటీ రిటర్న్స్ ఎలా సమర్పించాలో తెలుసుకుందామా..!
ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఇలా వేర్వేరు గడువులు
పన్ను చెల్లింపుదారులను బట్టి వారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వేర్వేరు గడువులు ఉంటాయి. వ్యక్తులు, వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేయాలి. హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్యూఎఫ్)కు జూలై నెలాఖరే తుది గడువు. భారత్లో పన్ను చెల్లింపు దారుల్లో వ్యక్తులు, వేతన జీవులు, హెచ్యూఎఫ్లే ఎక్కువ.
కంపెనీలు, అంతర్జాతీయ లావాదేవీలపై ఇలా
వివిధ కంపెనీల్లో పని చేసే భాగస్వాముల పన్ను చెల్లింపులను అడిటింగ్ చేయాల్సి ఉంటుంది. కనుక వారికి ఆదాయం పన్ను చట్టం కింద ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు ఉంది. కంపెనీల యాజమాన్యాలు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి అక్టోబర్ నెలాఖరు వరకు టైం ఉంటుంది. ఒకవేళ గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ లావాదేవీలు జరిపిన వారు ఆదాయం పన్ను చట్టంలోని 92 సెక్షన్ కింద ఆ వివరాలు సమర్పించాలి. అలా అంతర్జాతీయ లావాదేవీలు జరిపిన సంస్థలు, వ్యక్తులు ఐటీఆర్ సమర్పించడానికి నవంబర్ నెలాఖరు వరకు గడువు విధించింది ఆదాయం పన్ను విభాగం.
గడువు దాటితే ఇలా ఫైన్ చెల్లించాలి
ఒక్కోసారి వివిధ కారణాల రీత్యా ఐటీఆర్ సమర్పించడం ఆలస్యం కావచ్చు. అటువంటి వారు ఫైన్ చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అలా జరిమానాతో ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ నెలాఖరు వరకు సమర్పించవచ్చు. ఆ జరిమానా కూడా పన్ను వర్తించే ఆదాయాన్ని బట్టి నిర్ణయించింది ఆదాయం పన్ను విభాగం.
రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టంలోని 234ఏ సెక్షన్ కింద ఇటువంటి వారు అదనంగా వడ్డీ పే చేయాల్సి వస్తుంది.
ఐటీ రిటర్న్స్ సబ్మిషన్ ఇలా
ఇప్పుడు ఎవరైనా ఐటీరిటర్న్స్ సబ్మిట్ చేయడం చాలా తేలిక. ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్కెళ్లి ఐటీ రిటర్న్స్ సబ్మిషన్ పూర్తి చేయొచ్చు. https : // www.incometax.gov.in/iec/foportal లింక్ ద్వారా నేరుగా వెబ్సైట్లోకి వైళ్లి మీ పాన్ నంబర్ ద్వారా లాగిన్ కావచ్చు.
ఈ-ఫైల్లోకి వెళ్లి అసెస్మెంట్ ఇయర్ 2022-23 అని టైప్ చేయాలి. మీ వార్షిక ఆదాయం, స్టేటస్, ఇతర వివరాలను బట్టి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఎంపిక చేసుకోవాలి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గల కారణాన్ని సెలెక్ట్ చేసి.. అందులో ముందే డేటా నింపి ఉన్న ఫామ్ సబ్మిట్ చేయాలి. అటుపై సంబంధిత ఇతర పత్రాలు సబ్మిట్ చేయాలి. మీ ఐటీఆర్ డిటైల్స్ అప్డేట్ చేసుకోవాలి.
అంతా పూర్తయిన తర్వాత మీరు నమోదు చేసిన వివరాలు ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి. ఇందుకు కొంత టైం పడుతుంది. ఐటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ సబ్మిట్ చేసిన 120 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

