హైదరాబాద్, మే 24: దక్షిణాదిలో అతిపెద్ద బీ2బీ ఇండస్ట్రీయల్ యంత్రాలు అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్‌కు మరోసారి హైదరాబాద్ వేదికైంది. నాలుగోసారి జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ఇంజినీరింగ్, మౌలిక రంగానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్రోక్ఫిల్డ్..భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో తన ఆస్తులను 100 బిలియన్ డాలర్ల స్థాయిలో పెంచుకోవడానికి భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది. ప్రస్తుతం సంస్థ భారత్‌లో 30 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కలిగివున్నది. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రైవేట్ ఈక్విటీల్లో తన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కలిగివున్నది.