Lamborghini | న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లంబోర్ఘిని.. దేశీయ మార్కెట్లోకి మరో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఊరస్ ఎస్ఈ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.4.57 కోట్లు(నూఢిల్లీ షోరూంలో). ఈ ఏడాది తొలినాళ్లలో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండో హైబ్రిడ్ కారును ప్రస్తుతం దేశీయంగా విడుదలచేసింది సంస్థ. ట్విన్ టర్బో 4.0 లీటర్ వీ8 ఇంజిన్‌తో తయారైన ఈ కారులో 25.9 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో తయారు చేసింది.
సింగిల్ చార్జింగ్‌తో కేవలం 60 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 3.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 312 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడల్‌ను విడుదల చేసినట్లు ఆటోమోబిలి లంబోర్ఘిని ఆసియా పసిఫిక్ రీజియన్ డైరెక్టర్ ఫ్రాన్స్స్కో స్కార్డోని తెలిపారు. 2023లో సంస్థ 103 యూనిట్లను విక్రయించింది.