హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ల్యాబ్-32 కార్యక్రమం టీ హబ్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వరుసగా ఇది 11వ సారి జరగడం విశేషం. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించమే లక్ష్యంగా ల్యాబ్ యాక్సిలరేటర్‌ను టీ హబ్ గతంలోనే ఏర్పాటు చేసింది.
కనీస ఆచరణీయ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ ఫండింగ్ సమకూర్చడంతోపాటు మార్కెటింగ్, నెట్ వర్కింగ్లకు సంబంధించి సహాయ సహకారాలను టీ హబ్ అందించనున్నది. గత ఏడేండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.