HD Kumaraswamy | నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సెమీ కండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ (Micron) విషయమై తన వ్యాఖ్యలను వక్రీకరించారని శనివారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు.
‘సెమీ కండక్టర్ ఒక వ్యూహాత్మక పరిశ్రమ. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఉత్పత్తుల తయారీలో సెమీ కండక్టర్ బేసిక్ రిక్వైర్మెంట్. ఈ రెండు రంగాలు భారీగా ఉద్యోగాలు కల్పిస్తాయి. దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ, పీఎంఓ ఇండియా తీసుకుంటున్న చర్యలను నేను అభినందిస్తున్నా. నా మంత్రిత్వశాఖ ద్వారా యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు నేను పని చేస్తా’ అని కుమార స్వామి పోస్ట్ చేశారు. ఈ నెల 11న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా హెచ్డీ కుమారస్వామి బాధ్యతలు స్వీకరించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఏ రాష్ట్రం పేరు ప్రస్తావించలేదని, ఇక ముందు తాను ఆచితూచి వ్యవహరించాల్సి ఉందన్నారు.