ముంబై, జూలై 26: కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,472 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది నమోదైన రూ.7,448 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది.
రిటైల్ కమర్షియల్ వాహనాలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరడం వల్లనే లాభాల్లో భారీ గండిపడిందని పేర్కొంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,200 కోట్ల నిధులను కేటాయించింది.