ముంబై, సెప్టెంబర్ 9: కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది. గృహ రుణాల మార్కెట్‌ను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో బ్యాంక్ వడ్డీరేటును 0.15 శాతం తగ్గించింది. దీంతో రుణ రేటు 6.50 శాతానికి పరిమితమైంది. గృహ రుణాల వడ్డీరేట్లలో ఇదే అత్యంత చౌకది కావడం విశేషం. ఈ విషయాన్ని బ్యాంక్ ప్రెసిడెంట్ అంబూజ్ చంద్న తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ప్రత్యేక వడ్డీరేటు రెండు నెలల మాత్రమే నవంబర్ 8 వరకు అందుబాటులో ఉండనున్నదని ఆయన పేర్కొన్నారు. వేతనాన్ని అందుకుంటున్న అధిక క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి మాత్రమే ఈ వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.