హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : బృహస్పతి టెక్నాలజీస్‌కు కోల్‌కతా మెట్రో ఐపీ ఆధారిత సర్వైలెన్స్ సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి రూ.25.34 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కాంట్రాక్టు లభించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ, సీఈవో రాజశేఖర్ పాపోలు తెలిపారు.
ప్రజల భద్రతా రంగంలో కోల్‌కతా మెట్రోతో భాగస్వామ్యం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఐపీ ఆధారిత సీసీ టీవీ సిస్టమ్‌లు, ఏఐ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌లు దేశంలోని ప్రజా రవాణా పర్యవేక్షణ విధానాన్ని మారుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.