హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ప్రాజెక్టులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 2047 నాటికి వికసిత్ భారత్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ విజన్‌లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలో పలు సంసరణలు తీసుకొచ్చామన్నారు.
ఒడిశాలోని తాలాబిరా, మచ్చకట పాత్రపారాల్లో.. జార్ఖండ్‌లోని సౌత్ పచ్వారా, నార్త్ దాదుల్లో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్ఎల్సీ ద్వారా విశేషమైన కృషి జరుగుతుందన్నారు. ఎన్ఎల్సీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ప్రమాద బీమా వర్తించేలా పరిశీలించాలని సూచించారు