పూణె, సెప్టెంబర్ 2 5: ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహన సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యుషన్స్..తాజాగా దేశీయ మార్కెట్లోకి ఈ-లూనా ప్రైమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ లూనా సింగిల్ చార్జింగ్‌తో 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.82,490గా నిర్ణయించింది.
ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడంలో భాగంగా ఈ-లూనా ప్రైమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పట్టణ, గ్రామీణ ప్రాంత కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ-లూనా ప్రైమ్‌ను డిజైన్ చేసింది.