Kia sedan K4 |దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం సెడాన్ ‘కే4’ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 27న న్యూయార్క్ ఆటో షోలో ఈ కారును ప్రదర్శిస్తారు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో ‘కియా సెడాన్ కే4’ సేల్స్ ప్రారంభం అవుతాయి. హోండా సివిక్, టయోటా కొరొలా, హ్యుండాయ్ ఎలంత్రా మోడల్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతిని వెల్లడించలేదు. ప్రస్తుతం న్యూ సబ్-4 మీటర్ ఎస్యూవీ క్లావిస్ ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నది. త్వరలో కియా ఆవిష్కరించనున్న ‘కియా క్లావిస్’.. ఎస్యూవీ సెగ్మెంట్ కార్లలో సొనెట్, సెల్టోస్ మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
కియా ప్రీమియం సెడాన్ ‘కే4’ ఎక్స్టీరియర్గా కార్నివాల్, ఈవీ9 మోడల్ కార్ల తరహాలో డిజైన్ చేస్తున్నది. ఫ్రంట్‌లో టైగర్ నోస్ గ్రిల్లె, ఇరువైపులా షార్ప్ ఎల్-షేప్డ్ వెర్టికల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. సైడ్లలో స్లాపింగ్ రూఫ్ లైన్ తోపాటు పొడవైన బాయ్ నెట్ ఉంటుంది. చూడటానికి కూపే తరహా లుక్ తో వస్తుంది. సీ-పిల్లర్ లో రేర్ డోర్ హ్యాండిల్, రేర్ స్మార్ట్ లుకింగ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మస్క్యులర్ హౌంచెస్, లార్జ్ గ్లాస్ ఏరియాపై ఎల్-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. మీడియం గ్రే, స్లేట్ గ్రీన్, కాన్యాన్ బ్రౌన్, ఓనిక్స్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
ఇంటీరియర్‌గా కియా ‘కే4’ కారు కాన్యాన్ బ్రౌన్, ఓనిక్స్ బ్లాక్, మీడియం గ్రే తోపాటు క్యాబిన్లో ఫ్రెష్ స్లేట్ గ్రీన్ థీమ్ తో వస్తుంది. డాష్ బోర్డు మధ్యలో డ్యుయల్ స్క్రీన్ డిస్ ప్లే , రోటరీ డయల్‌పై ఫిజికల్ బటన్స్, మోడర్న్ లుక్‌తో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ సైడ్ డోర్, ప్యాసింజర్ డోర్ వేర్వేరు కలర్ కాంబినేషన్లలో ఉంటాయని భావిస్తున్నారు.