Kia Seltos | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India) తన సెల్టోస్ ఎక్స్ -లైన్ కారు కొత్తగా ‘అరోరా బ్లాక్ పెరల్’ రంగులో మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రస్తుత మ్యాట్టె గ్రాఫిటి ఫినిష్ రంగుకు ఆల్టర్నేటివ్ గా అరోరా బ్లాక్ పెరల్ కలర్ ఆప్షన్ లో తెచ్చింది. క్రెటా ఎక్స్-లైన్ కారులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లలో మార్పులు చేసింది. ఇంటీరియర్ డ్యుయల్ టోన్ బ్లాక్ అండ్ స్ప్లెండిడ్ సాగే గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది. 2024 కియా సెల్టోస్ ఎక్స్ లైన్ కారు అరోరా బ్లాక్ పెరల్ బ్లాక్ వేరియంట్ రూ.19.65 లక్సల నుంచి రూ.20.37 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
కియా సెల్టోస్ ఎక్స్ టీరియర్ కారు గ్లాస్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్లె, గార్నిష్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, రేర్ బంపర్ గార్నిష్, రేర్ స్కిడ్ ప్లేట్, రూఫ్ రాక్, ఔట్ సైడ్ మిర్రర్స్, డీఎల్ఓ (డే లైట్ ఓపెనింగ్), షార్క్ ఫిన్ అంటేనా, స్పాయిలర్, ఔట్ సైడ్ డోర్ హ్యాండిల్స్, సైడ్ డోర్ గార్నిష్, వీల్ సెంటర్ క్యాప్ ఔట్ లైన్, 18 అంగుళాల డ్యుయల్ టోన్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ విత్ బ్లాక్ గ్లాసీ ఔట్ లైన్, టెయిల్ గేట్ పై ఎక్స్-లైన్ లోగో ఉంటాయి.
కియా సెల్టోస్ ఎక్స్-లైన్ ఇంటీరియర్ గా స్ప్లెండిడ్ గ్రీన్ అండ్ బ్లాక్ రీఫైన్డ్ కలర్ థీమ్, ఆరెంజ్ స్టిచింగ్ తోపాటు స్ప్లెండిడ్ సాగే గ్రీన్ సీట్స్, మ్యాచింగ్ కన్సోల్, డోర్ ఆర్మ్ రెస్ట్స్, బ్లాక్ ఇంటీరియర్ ల్యాంప్స్, సన్ విజర్, అసిస్ట్ గ్రిప్స్, పిల్లర్స్ మీద స్లీక్ బ్లాక్ ట్రిమ్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ కారు 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ (116 హెచ్పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 హెచ్పీ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్) వెలువరిస్తాయి.