Kia Seltos diesel | లీడింగ్ ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా శుక్రవారం తన న్యూ సెల్టోస్ కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. న్యూ సెల్టోస్ కారు ఐదు న్యూ సెల్టోస్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టెక్ లైన్ ట్రిమ్స్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.11,99,900 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దీంతో కియా సెల్టోస్ 24 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చినట్లయింది. గతేడాది జూలైలో న్యూ సెల్టోస్.. మార్కెట్లోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు 65 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.
15 హై-సేఫ్టీ ఫీచర్లు, 17 మోస్ట్ ఎవాల్వ్డ్ లెవెల్ 2-అడాస్ అటానమస్ ఫీచర్లతోపాటు 32 సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. డ్యుయల్ స్క్రీన్ పనోరమిక్ డిస్ ప్లే విత్ 26.04 సీఎం ఫుల్ డిజిటల్ క్లస్టర్, 26.03 సీఎం హెచ్డీ టచ్ స్క్రీన్ నేవిగేషన్, డ్యుయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, ఆర్17 43.66 క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్లు జత కలిశాయి.
2019లో తొలుత మార్కెట్లో ఆవిస్కరించినప్పటి నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆరు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత్లో కియా కార్ల విక్రయాల్లో 51 శాతానికి పైగా సెల్టోస్దే వాటా. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి పది కియా కార్లలో సెల్టోస్ ఒకటి.
1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ మోడల్ హెచ్టీకే వేరియంట్ 6-మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ.13,59,900, హెచ్టీకే+ 6-మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.14,99,900, హెచ్టీఎక్స్ 6-మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.16,67,900, హెచ్టీఎక్స్ + 6-మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.18,27,900 పలుకుతుంది.