న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా..దేశీయ మార్కెట్‌కు మరో ఈవీని పరిచయం చేసింది. ఈవీ 9 పేరుతో విడుదల చేసిన ఈ కారు ధర రూ.1.3 కోట్లుగా నిర్ణయించింది. ఇప్పటికే సంస్థ రూ.61 లక్షల విలువైన ఈవీ 6ని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ తయారు చేస్తున్నవి ఈ రెండు మాడళ్లు. దీంతోపాటు రూ.63.9 లక్షల ధర కలిగిన కార్నివాల్ లిమౌసైన్ మాడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగూలీ మాట్లాడుతూ…వచ్చే ఏడాది మాస్ సెగ్మెంట్లో తొలి ఈవీ కారును విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 2030 నాటికి వార్షిక విక్రయాలు 4 లక్షల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇందుకోసం మాస్ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు.