Kia Carens X-Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన పాపులర్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కరెన్స్ ఎక్స్-లైన్ ఎడిషన్ కారును మంగళవారం ఆవిష్కరించింది. పండుగల సీజన్ నేపథ్యంలో న్యూ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లతో కరెన్స్ ఎక్స్-లైన్ తీసుకొచ్చింది కియా ఇండియా.
కియా ఇండియా కరెన్స్ ఎక్స్-లైన్ రెండు వేరియంట్లు -పెట్రోల్ డీసీటీ, డీజిల్ 6-స్పీడ్ ఏఎంటీ వర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ డీసీటీ వేరియంట్ ధర రూ.18.94 లక్షలు (ఎక్స్ షోరూమ్), 6-స్పీడ్ ఏఎంటీ వేరియంట్ రూ.19.44 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
భారత్ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్-6, టయోటా రూమియన్, హ్యుండాయ్ అల్కాజర్ వంటి మోడల్ కార్లతో కియా కరెన్స్ ఎక్స్-లైన్ పోటీ పడుతుంది. ఇంతకుముందు కియా ఇండియా తన కార్లన్నీ రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేసింది.
కియా కరెన్స్ ఎక్స్-లైన్ ఎడిషన్ కారు ఎక్స్టీరియర్గా మ్యాట్టె గ్రాఫైట్ కలర్ ఆప్షన్, ఫ్రంట్ గ్రిల్లెపై క్రోమ్ ఫినిష్, సిల్వర్ కలర్డ్ ఫ్రంట్ కాల్లిపర్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. స్క్రీన్ మిర్రరింగ్, పాడ్ కాస్ట్స్, ఇతర ఎంటర్ టైన్మెంట్ యాప్స్ ఉంటాయి.
కియా కరెన్స్ ఎక్స్-లైన్ పవర్ ట్రైన్ యధాతథంగా ఉంటుంది. 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 7-స్పీడ్ డీసీటీ యూనిట్ పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 253 టార్క్, 158 బీహెచ్పీ పవర్ విడుదల చేస్తుంది. 6-స్పీడ్ ఏటీ డీజిల్ ఇంజిన్ వేరియంట్ 115 బీహెచ్పీ విద్యుత్ 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫయర్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, అండర్ సీట్ ట్రే, ఫుల్ లెదరెట్టే సీట్స్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఫాగ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.