Kia Carens | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ గురువారం సెవెన్ సీటర్ యుటిలిటీ (ఎస్యూవీ) ‘కరెన్స్’ను ఆవిష్కరించింది. ఇది రిక్రియేషనల్ వెహికల్ అని కియా పేర్కొన్నది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారత్ విపణిలో అడుగు పెడుతున్న నాల్గో మోడల్ కారుగా కరెన్స్ నిలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లోనే తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందని సమాచారం.
సెల్టోస్ మాదిరిగా కాకుండా సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్.. బోల్డ్ డిజైన్, హైటెక్ ఫీచర్లతో రానున్నది. ఎంపీవీ వెనుక టీ ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్లు కలిగి ఉంది. చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్, ఫాక్స్ స్కిడ్ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి.
కియా కరెన్స్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీల కెమెరాలు కూడా అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్‌స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్-రేర్ పార్కింగ్ సెన్సార్లతో ఈ కారులో ప్రయాణించే వారికి మరింత భద్రత లభిస్తుంది.
కియా కరెన్స్ 1.5 లీటర్ల సీఆర్డీఐ డీజిల్ లేదా 1.4 లీటర్ల జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. 2 వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. డిజిటల్ పవర్ ట్రైన్లో 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్బ్యాక్ కూడా ఎంచుకోవచ్చు.