న్యూఢిల్లీ, జూన్ 3: దేశీయ వాహన మార్కెట్లో కియా కారెన్స్ జోరు మీదున్నది. 27 నెలల్లో 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటింది. టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతీ సుజుకీ ఎర్టిగా తదితర మాడళ్ల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. వాహనదారులను ఆకట్టుకుంటూ అమ్మకాల్లో దూసుకుపోతున్నది. 2022 ఫిబ్రవరిలో మార్కెట్కు పరిచయమైన కియా కారెన్స్లో సన్రూఫ్, మల్టీ డ్రైవ్ మోడ్స్, వెంటిలేటెడ్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. ఇక ఈ కారు ధరల శ్రేణి రూ.12.88-23.94 లక్షల మధ్య ఉన్నది.