న్యూఢిల్లీ, జూన్ 27: హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీ..తాజాగా ఆర్థిక రాజధాని ముంబైలో తన ఆఫీస్‌ను ఆరంభించింది. ఈ నూతన కార్యాలయం కోసం కొత్తగా 300 మంది ఉద్యోగులను నియమించుకోలనుకుంటున్నట్లు కేఫిన్ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ నాదెళ్ళ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, ముంబైలో ఏర్పాటు చేసిన నూతన ఆఫీస్‌కోసం ప్రతిభ కలిగిన సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా సంస్థ త్వరలో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో కూడా ఆఫీస్‌ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నది.