హైదరాబాద్, జూలై 3 : దేశీయ మార్కెట్లోకి అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది కీవే ఇండియా. హైప్‌వోల్ట్-ఆర్ పేరుతో విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్‌ను ఆన్లైన్లో రూ.5 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. కేవలం 2.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 115 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
అలాగే 5 కిలోవాట్ల బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 5 కిలోవాట్ల డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ, రియర్ రీవర్స్ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-చానెల్ ఏబీఎస్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్స్‌తో ఈ స్కూటర్‌ను తయారు చేసింది. కేవలం మూడు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు రీచార్జికానున్నది.