Aptronix store | హైదరాబాద్: యాపిల్ ఐఫోన్లను విక్రయించడానికి లైసెన్స్ పొందిన ఆప్ట్రోనిక్స్.. రిటైల్ మార్కెట్లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నది. యాపిల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 14 నుంచి 20 స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. సిద్దిపేటలో త్వరలో రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించబోతున్నది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయనగరం, భీమవరంతోపాటు మైసూరులలో కూడా స్టోర్‌ను తెరవబోతున్నది. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 56 స్టోర్లు, 16 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఈ స్టోర్లలో ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 మాడళ్లు అందుబాటులో ఉంచింది. అప్‌గ్రేడ్ అయ్యే కస్టమర్లకు ఎక్సేంజ్ బోనస్ కింద రూ.20 వేల నుంచి రూ.25 వేల లోపు ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుపై రూ.5 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నది సంస్థ.