హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్‌ను తిరిగి నియమించుకున్నది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఎన్టీఆర్‌తో తెలంగాణతోపాటు ఏపీ, దేశ, ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం అవడానికి దోహదం చేయనున్నదని మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. మలబార్‌కు మళ్లీ ప్రచాకర్తగా వ్యహరిస్తుండటం చాలా సంతోషంగా ఉన్నదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటం వల్ల అంతర్జాతీయంగా తమ బ్రాండ్‌కు మరింత గుర్తింపు లభించనున్నదని మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 11దేశాలలో 320 షోరూములతో 6వ అతిపెద్ద రిటైలర్‌గా మలబార్ గోల్డ్ ప్రఖ్యాతిగాంచింది. అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా ఉంటూ భారతీయ కళాత్మకత, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే డిజైన్లను మలబార్ గోల్డ్ అందుబాటులో ఉంచింది.