హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాల కొనుగోళ్ళపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.50 వేల కంటే అధిక విలువైన డైమండ్లు, అన్‌కట్ డైమండ్లు, విలువైన ఆభరణాల కొనుగోళ్ళపై రూ.2 వేల విలువైన గిఫ్ట్ వోచర్ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు రూ.50 వేలు అంతకంటే విలువైన బంగారం ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల విలువైన గిఫ్ట్ వోచర్ అందిస్తున్నది. అలాగే రూ.10 వేల విలువైన వెండి ఆభరణాల కొనుగోళ్ళపై రూ.500 విలువైన వోచర్‌ను కస్టమర్లకు సంస్థ గిఫ్ట్‌గా ఇస్తున్నది. వీటితోపాటు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తున్నది. ఈనెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉండనున్నది.