న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో పలు టెక్ దిగ్గజాలు లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్, సేల్స్‌ఫోర్స్, టిక్‌టాక్‌లు వేలాది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం విమియో తమ ఉద్యోగుల్లో 11 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈమెయిల్స్ అందాయని, వారంతా తమ టీం లీడర్లు, హెచ్ఆర్తో సమావేశం కానున్నారని లేఆఫ్స్‌ను ప్రకటిస్తూ విమియో సీఈఓ అంజలి సూద్ ఆన్లైన్ లెటర్లో పేర్కొన్నారు.
సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లో ఎక్కువ మంది సిబ్బందిని తొలగించినట్టు సమాచారం. గత ఏడాది జులైలోనూ కంపెనీ పలువురు ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో ఆరు శాతం మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నామని అంజలి సూద్ ప్రకటించారు. కాగా, కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌తో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.