న్యూఢిల్లీ, మే 5: బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రేంజ్ రోవర్‌కి చెందిన పలు మాడళ్ల ధరలను తగ్గించినట్టు జేఎల్ఆర్ ఇండియా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదలాయించడంతో రేంజ్ రోవర్ ఎస్వీ, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ మాడళ్లు రూ.75 లక్షల వరకు దిగిరానున్నాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో రేంజ్ రోవర్ ఎస్వీ మాడల్ రూ.4.25 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు దిగిరానుండగా..అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ మాడల్ కూడా రూ.2.75 కోట్ల నుంచి రూ.2.35 కోట్లకు దిగొచ్చింది. ఈ ధరలు అమల్లోకి వచ్చాయని పేర్కొంది.