దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోలో మదుపర్ల నుంచి షేర్ల డిమాండ్ రూ.7.40 లక్షల కోట్లను దాటిపోయింది. ఇందులో పబ్లిక్ ఐపీవో బిడ్ల విలువ రూ.4.90 లక్షల కోట్లుగా ఉంటే.. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్ల విలువ రూ.2.50 లక్షల కోట్లుగా ఉన్నది.
- 19.75 కోట్ల షేర్లకు 438.3 కోట్ల బిడ్లు
- 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
- రికార్డులతో అదరగొట్టిన దేశీయ టెలికాం దిగ్గజం
- మునుపెన్నడూ లేనివిధంగా 1.39 కోట్ల దరఖాస్తులు
- రూ.7.4 లక్షల కోట్లు దాటిన ఆర్డర్లు
ముంబై, అక్టోబర్ 23 : జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అదరగొట్టింది. శుక్రవారం ముగిసిన ఈ పబ్లిక్ ఇష్యూతో దేశ, విదేశీ ఐపీవో మార్కెట్లలో పాత రికార్డులు చెరిగిపోతే.. కొత్త రికార్డులు నమోదయ్యాయి. బుధవారం మొదలైన ఈ ఫ్రెష్ ఇష్యూకు అన్ని రకాల మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది మరి.
- జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోలో మదుపర్ల నుంచి షేర్ల డిమాండ్ రూ.7.40 లక్షల కోట్లను దాటిపోయింది. ఇందులో పబ్లిక్ ఐపీవో బిడ్ల విలువ రూ.4.90 లక్షల కోట్లుగా ఉంటే.. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్ల విలువ రూ.2.50 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో భారతీయ క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ డిమాండ్‌కు ఇదో సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
- ఈ పబ్లిక్ ఇష్యూ కోసం మొత్తం 1.39 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రపంచ ఐపీవోల్లో ఇదే రికార్డు. అంతేగాక 2024 అక్టోబర్‌లో వచ్చిన భారతీయ ఐపీవో వారీ ఎనర్జీస్ 97.34 లక్షల దరఖాస్తుల రికార్డు చెరిగిపోయింది.
- రూ.30,213 కోట్లతో దేశీయ అతిపెద్ద ఐపీవోగా జియో రికార్డు సృష్టించింది. మునుపు ఈ రికార్డు హ్యుందాయ్ మోటర్ ఇండియా (రూ.27,870 కోట్లు) పేరిట ఉండేది. జియో ఐపీవో షేర్ల ధరల శ్రేణి రూ.1,065-1,119.
- జియో ప్లాట్‌ఫామ్స్.. క్యాపిటల్ మార్కెట్లలోకి దాదాపు రూ.10.30 లక్షల కోట్ల (109 బిలియన్ డాలర్లు) విలువతో ప్రవేశిస్తున్నది. ఫలితంగా భారత్‌లో ఓ ఐపీవోను ప్రారంభించిన అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అంతేగాక దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన టాప్-5 విలువైన కంపెనీల్లో కూడా ఒకటిగా జియో ఉంటుందన్న అంచనాలున్నాయి.
- ఈ ఐపీవోలో మొత్తం 27 కోట్ల షేర్లు జారీ అయితే 655.68 కోట్ల షేర్లకు డిమాండ్ వచ్చింది. ఇందులో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చినవి 19.75 కోట్ల షేర్లు (విలువ రూ.22,078 కోట్లు). వీటి కోసం 438.3 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. ఐపీవో బుక్ 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది.
- యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల షేర్ల (217.38 కోట్ల షేర్లు)ను కేటాయించారు. కానీ సోమవారం 212 మంది రూ.2.5 లక్షల కోట్లకు సరిపడా బిడ్లు వేశారు. దీంతో యాంకర్ బుక్ 30 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది.
- క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులు (క్యూఐబీ) 70.55 రెట్లు అధికంగా బిడ్లను దాఖలు చేశారు. 4.9 కోట్లకు 345.8 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. వీటి విలువ రూ.3,86,901 కోట్లు. సంస్థాగతేతర మదుపర్లు (ఎన్ఐఐ) 14 రెట్లు, రిటైల్ వ్యక్తిగత మదుపర్లు (ఆర్ఐఐ) 2.72 రెట్లు, ఉద్యోగులు 2.93 రెట్లు, వాటాదారులు 7.60 రెట్లు ఎక్కువగా బిడ్లు వేశారు.
- జియో రిటైల్ అప్లికేషన్లు 98.58 లక్షలను దాటిపోయాయి. గతంలో వారీ ఎనర్జీస్ 70.13 లక్షల దరఖాస్తులే రికార్డు. జియో హెచ్ఎన్ఐల అప్లికేషన్లు 9.37 లక్షలు మించిపోయాయి. ఇందులో పెద్ద హెచ్ఎన్ఐలవి 3.62 లక్షలు, చిన్న హెచ్ఎన్ఐల దరఖాస్తులు 5.74 లక్షలకుపైగా ఉన్నాయి.
- వాటాదారుల అప్లికేషన్లు 20.77 లక్షలపైనే. వీటి విలువ రూ.19,000 కోట్లు. ఉద్యోగుల అప్లికేషన్లు 2.04 లక్షలకు పైమాటే. నాన్-క్యూఐబీల బిడ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. హెచ్ఎన్ఐల బిడ్ల విలువ రూ.57,109 కోట్లుగా ఉన్నది ఐపీవో తొలిరోజునే రూ.69,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 3.04 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది.
- సోమవారం (అక్టోబర్ 26) మదుపర్ల మధ్య షేర్ల కేటాయింపులు జరుగనున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లోకి మంగళవారం (అక్టోబర్ 27) షేర్లను జమ చేస్తారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో బుధవారం (అక్టోబర్ 28) జియో ప్లాట్‌ఫామ్స్ నమోదవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

