Home
International
Former Hungarian Minister Under Investigation As Authorities Seize Hidden Cash In Corruption Probe
అడవుల్లో కట్టల కొద్దీ అవినీతి సొమ్ము
హంగేరీ మాజీ మంత్రి మిక్లోష్ సెజ్టాక్ అవినీతిపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆయన మంత్రిగా ఉండగా ఆర్జించిన అక్రమ సంపాదనపై దాడులు ప్రారంభించింది.
- హంగేరీ మాజీమంత్రి కేసులో 188 కోట్ల నగదు లభ్యం
- అడవులు, గోదాముల్లో దాచిన మిక్లోష్ సెజ్టాక్
బుడాపెస్ట్ : హంగేరీ మాజీ మంత్రి మిక్లోష్ సెజ్టాక్ అవినీతిపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆయన మంత్రిగా ఉండగా ఆర్జించిన అక్రమ సంపాదనపై దాడులు ప్రారంభించింది. అడవులు, వ్యవసాయ భవనాలు, గోదాముల్లో దాచిన సుమారు రూ.188 కోట్లను పీటర్ మగ్యార్ ప్రభుత్వం వెలికితీసింది. అడవుల్లో పాతిపెట్టిన కట్టల కట్టల నగదును చూసి అధికారులు విస్తుపోయారు.
ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో 16 ఏండ్లుగా అధికారంలో ఉన్న విక్టర్ ఓర్బన్ను పీటర్ మగ్యార్ ఓడించి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఓర్బన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మిక్లోష్ సెజ్టాక్పై లంచం కేసులో సోదాలు జరిపారు. ‘సోదాల సమయంలో దర్యాప్తు అధికారులు అడవుల్లో పాతిపెట్టిన, వ్యవసాయ భవనాలు, గోదాములు, ఒక నివాస భవనంలో దాచిన భారీ నగదును గుర్తించారు’ అని అధికారులు శుక్రవారం తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

