కొట్టకున్నా.. పడగొట్టారు
న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టును మట్టికరిపించి వన్డే సిరీస్‌నూ 3-1తో చేజిక్కించుకుంది. బ్యాట్‌తో విఫలమైనా బంతితో బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై అయ్యర్ సేన 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 210 పరుగుల స్వల్ప ఛేదనలో కివీస్ 187 వద్దే ఆగిపోయి ఏడేండ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
- ఆఖరి వన్డేలో భారత్‌దే గెలుపు
- 3-1తో సిరీస్ కైవసం
- ఛేదనలో తేలిపోయిన న్యూజిలాండ్
- బౌలర్ల విజృంభణతో టీమిండియా జయభేరి
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టును మట్టికరిపించి వన్డే సిరీస్‌నూ 3-1తో చేజిక్కించుకుంది. బ్యాట్‌తో విఫలమైనా బంతితో బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై అయ్యర్ సేన 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 210 పరుగుల స్వల్ప ఛేదనలో కివీస్ 187 వద్దే ఆగిపోయి ఏడేండ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/30), మహ్మద్ సిరాజ్ (2/50), అక్షర్ పటేల్ (2/28) రాణించి బ్లాక్‌క్యాప్స్‌ను నిలువరించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. అక్షర్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), ఇషాన్ (58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించడంతో 42.1 ఓవర్లకు 209 రన్స్ చేయగల్గింది. సిరీస్‌లో 9 వికెట్లు తీసిన గుర్నూర్ బ్రార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా ఈనెల 19 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.
బంతితో కట్టడిచేసి..
భారత విజయంలో బౌలర్లదే కీలకపాత్ర. బ్యాట్‌తో విఫలమైనా శ్రేయస్ అండ్ కో. ఈ మ్యాచ్‌లో గెలిచిందంటే అది బౌలర్ల చలవే. తక్కువ స్కోరే చేసిన సిరాజ్ మినహా పెద్దగా అనుభవం లేని పేస్ దళం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను కట్టడిచేసింది. స్థానిక వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకుంటూ సిరాజ్ అండ్ కో. చెలరేగింది. మొదట ఈ హైదరాబాదీ పేసర్.. సీఫర్ట్ (14)ను ఆరో ఓవర్లో ఔట్ చేసి పర్యాటక జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందిపడిన యంగ్ (22)ను అర్ష్‌దీప్ 17వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. 20 ఓవర్లకు కివీస్ స్కోరు 80/2గానే ఉంది. అర్ష్‌దీప్ 21వ ఓవర్లో కెల్లీ (24)కి షాకివ్వగా వెంటనే సిరాజ్.. ప్రమాదకర ఫిన్ అలెన్ (1)ను బౌల్డ్ చేయడంతో కివీస్ కోలుకోలేకపోయింది.
ఈ క్రమంలో ఫాక్స్‌క్రాఫ్ట్ (31), బ్రాస్‌వెల్ (19) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఐదో వికెట్‌కు 36 రన్స్ జతచేశారు. కానీ డ్రింక్స్ తర్వాత ఆకిబ్ నబీ విసిరిన 31వ ఓవర్లో బ్రాస్‌వెల్.. నమన్ ధీర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జట్టు ఐదో వికెట్ నష్టపోయింది. ఆ వెంటనే తొలి వన్డే ఆడుతున్న యశ్ ఠాకూర్.. ఫాక్స్క్రాఫ్ట్ను బౌల్డ్ చేయడంతో కివీస్ కథ ముగిసిందనే అనుకున్నారంతా. కానీ కెప్టెన్ శాంట్నర్ (24).. టెయిలెండర్లతో కలిసి పోరాడాడు. క్రిస్టియన్ క్లార్క్ (16)తో కలిసి ఏడో వికెట్‌కు 39 రన్స్ జోడించి ఆ జట్టులో గెలుపు ఆశలు రేపాడు. అయితే నమన్.. శాంట్నర్‌ను బోల్తా కొట్టించి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. క్లార్క్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపించాడు. గెలుపు కోసం టిక్నర్ (14), డఫీ (9) పోరాడినా వారి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే!

టాపార్డర్ ఫెయిల్
నిర్ణయాత్మక మ్యాచ్ అయినప్పటికీ కివీస్ బౌలర్ల ధాటికి భారత టాపార్డర్ మరోసారి చేతులెత్తేసింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5)తో పాటు కెప్టెన్ శ్రేయాస్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18) విఫలమయ్యారు. మొదట మాథ్యూ ఫిషర్ (2/28) వరుస ఓవర్లలో రోహిత్, కోహ్లీని ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టగా 9వ ఓవర్లో డఫీ.. మూడు బౌండరీలతో టచ్‌లోనే ఉన్నట్టు కనిపించిన రుతురాజ్ (18)ను వెనక్కిపంపాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలెన్ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన శ్రేయాస్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టిక్నర్ బౌలింగ్‌లో అతడు ఫుల్‌షాట్ ఆడబోయి మిడాన్‌లో ఫిషర్ చేతికి చిక్కాడు.
అక్షర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు కీలకమైన 52 రన్స్ జోడించిన అయ్యర్ ఔటవడంతో అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ జాగ్రత్తగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టినా సింగిల్స్‌కే పరిమితమైన ఈ జోడీని 25వ ఓవర్లో బ్రాస్‌వెల్.. అక్షర్‌ను ఔట్ చేయడంతో భారత్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నమన్ (22) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. శాంట్నర్ ఒకే ఓవర్లో నబీ (5), ఠాకూర్‌ను ఔట్ చేయడంతో భారత్ 36 ఓవర్లకు 166/8తో నిలిచింది. కొద్దిసేపటికే ఇషాన్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ 200 రన్స్ అయినా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి వరుస బ్యాటైర్లెన సిరాజ్ (14 నాటౌట్), అర్ష్‌దీప్ (14) మెరుపులతో భారత్ మార్కును అందుకుంది
కివీస్ ఆధిపత్యానికి తెర
స్వదేశంలో కివీస్‌కు వన్డేల్లో 2019 తర్వాత ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం గమనార్హం. 2019-2026 మధ్య ఆ జట్టు ఏడేండ్ల వ్యవధిలో వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుని పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యాధృశ్చికంగా 2019 లోనూ ఆ జట్టు ఆఖరిసారి భారత్ చేతిలోనే ఓడిపోగా (1-4తో) ఏడేండ్ల తర్వాత మళ్లీ అదే టీమ్ చేతిలో ఖంగుతినడం విశేషం. సొంతగడ్డపై వరుసగా అత్యధిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా (2002 నుంచి 2009 దాకా వరుసగా 17 వన్డే సిరీస్‌లు) నిలిచింది. ఆ తర్వాత స్థానం కివీస్‌దే.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 42.1 ఓవర్లలో 209 ఆలౌట్ (అక్షర్ 46, ఇషాన్ 46, శాంట్నర్ 3/47, డఫీ 3/60); న్యూజిలాండ్: 48.1 ఓవర్లకు 187 ఆలౌట్ (ఫాక్స్‌క్రాఫ్ట్ 31, శాంట్నర్ 24, అర్ష్‌దీప్ 3/30, సిరాజ్ 2/50)
1 కోచ్‌గా గౌతం గంభీర్‌కు విదేశాల్లో ఇదే తొలి వన్డే సిరీస్ విజయం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

