న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో..9వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా అన్లిమిటెడ్ డాటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 5 నుంచి వచ్చే నెల 5 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ ఉచిత డాటా పొందాలంటే రూ.349 కంటే అధిక ప్లాన్ కింద సేవలు పొందుతున్న వారు అర్హులని తెలిపింది. ప్రస్తుతం రూ.349 ప్లాన్లో 5జీ డాటా అన్లిమిటెడ్ పొందుతున్నారు. ‘జియో 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నది. సంస్థపై 50 కోట్ల మంది భారతీయులు పెట్టుకున్న నమ్మకం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రతి ఒక్కరి జీవితంలో జియో ఒక భాగస్వామిగా మారిపోయిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.