Jio Phones | న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రిలయన్స్ జియో మరో రెండు ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీ2 సిరీస్‌లో భాగంగా మరో రెండు మాడళ్లను ప్రవేశపెట్టింది. జియో భారత్ వీ3, వీ4 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.1,099గా నిర్ణయించింది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారైన ఈ రెండు ఫోన్ల మెమొరీని 128 జీబీకి పెంచుకునే అవకాశం ఉన్నది.
ఇక్కడే డాటా స్టోరేజ్ చేయాలి: ఆకాశ్
భారతీయులందరూ దేశీయంగానే తమ డాటాను స్టోరేజ్ చేయాలని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ..దేశీయ డాటా స్టోరేజ్ సంస్థలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా విద్యుత్‌తో రాయితీ ఇస్తే దేశీయ కంపెనీలు ఇక్కడే ఏఐ ఆధారిత డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రానున్నట్లు చెప్పారు.