న్యూఢిల్లీ : 2022 కాలగర్భంలో కలిసిపోతుండగా రిలయన్స్ జియో ఆకట్టుకునే ఆఫర్‌తో హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్‌ను లాంఛ్ చేసింది. రూ .2023 విలువైన ఈ ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, అధిక డేటాతో 252 రోజుల వ్యాలిడిటీని జియో ఆఫర్ చేస్తోంది. జియో.కాంపై రూ .2023 ప్లాన్ అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకునే యూజర్లు మైజియో యాప్‌తో పాటు గూగుల్ పే, ఫోన్‌పే సహా థర్డ్ పార్టీ మొబైల్ రీచార్జి ప్లాట్‌ఫాంల ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక న్యూ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌లో భాగంగా పలు బెనిఫిట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. 252 రోజుల వ్యాలిడిటీతో 9 నెలల అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది.
ప్రతిరోజూ 2.5జీబీ డేటాతో పాటు రూ .2023 ప్లాన్ జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు , రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపే వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ సబ్స్క్రైబర్లకు న్యూ ఇయర్ ఆఫర్ కింద కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను జియో కల్పిస్తోంది. న్యూ ప్లాన్‌తో పాటు ప్రస్తుత రూ. 2999 ప్లాన్‌లో జియో పలు అదనపు ఆఫర్లను అందిస్తోంది. 75జీబీ అదనపు హైస్పీడ్, 23 రోజుల అదనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది.