ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు.. ఎందుకంటే?!
ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు | జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసేందుకు కల్రాక్-జలాన్ కన్సార్టియం సమర్పించిన ఆఫర్ను ఆ సంస్థ ఉద్యోగులు ....

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకుని నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసేందుకు కల్రాక్-జలాన్ కన్సార్టియం సమర్పించిన ఆఫర్ను ఆ సంస్థ ఉద్యోగులు తిరస్కరించారు. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు సవాల్ చేశారు. కల్రాక్-జలాన్ కన్సార్టియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్ను గత జూన్ 22న ఎన్సీఎల్ఏటీ ఆమోదించింది. సదరు కన్సార్టియం ప్రతిపాదించిన రిజొల్యూషన్ ప్లాన్ తమ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నదయని జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, భారతీయ కాంగార్ సేన్ (బీకేఎస్) ఆరోపించాయి.
క్లెయిమ్స్పై ఇలా వివాదం
ఉద్యోగుల నుంచి రూ.15 వేల కోట్ల క్లెయిమ్స్ ఉన్నాయని జెట్ ఎయిర్వేస్ అంగీకరించింది. కానీ కల్రాక్-జలాన్ కన్సార్టియం రూ.475 కోట్లతో సెటిల్ చేస్తామని ప్రతిపాదించింది. తమకు రూ.1,265 కోట్ల చెల్లింపులు జరుగాలని, కానీ తమ వేతన బకాయిల సమస్య సెటిల్ చేయడానికి రూ.52 కోట్లు ఇస్తామని ప్రతిపాదించిందని ఉద్యోగులు ఆరోపించారు. కానీ ఉద్యోగులకు సంస్థలో 0.5 శాతం ఈక్విటీ కల్పిస్తామని కన్సార్టియం హామీ ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

