పుణె, జూన్ 5: నయా మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది జీప్ ఇండియా. మెరిడియన్ ఎక్స్ ప్రత్యేక ఎడిషన్‌గా ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.29.49 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ైస్టెలింగ్ పరంగా, కస్టమర్ కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసిన ఈ మాడల్‌లో టాపెండ్ యాక్సససీరిస్తో తీర్చిదిద్దింది. దేశవ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.