న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా యెజ్డీ..వచ్చే పండుగ సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు బైకులను విడుదల చేసింది. యెజ్డీ అడ్వెంచర్, యెజ్డీ రోడ్‌స్టర్, ఫాల్కన్, స్క్రాంబ్లర్‌లో పలు నయా మాడళ్లను తీసుకొచ్చింది.
ఈ బైకులు రూ. 2.05 లక్షల ప్రారంభ ధర నుంచి గరిష్ఠంగా రూ.2.32 లక్షల గరిష్ఠ ధరతో లభించనున్నాయి. ఈ బైకులపై నాలుగేండ్లు లేదా 50 వేల కిలోమీటర్లు వ్యారెంటీ కల్పిస్తున్నది. దీనిని ఆరేండ్ల వరకు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది.