హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ జావా యెజ్డీ మోటర్‌సైకిల్.. తాజాగా మరో మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ బైకులను పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన 350 జావా 42 ఎఫ్జేను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు రూ.1.99 లక్షల నుంచి రూ.2.23 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ సందర్భంగా జావా యెజ్డీ కో-ఫౌండర్ అనుపమ్ తరేజా మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో 12 షోరూంలు ఉండగా, వచ్చే ఏడాదికాలంలో మరో 3 షోరూంలను కొత్తగూడెం, గద్వాల్, షాద్‌నగర్‌లలో ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 షోరూంలను నెలకొల్పబోతున్నట్లు ఆయన ప్రకటించారు.