న్యూఢిల్లీ: భవిష్యత్ సంప్రదాయేతర ఇంధనానికి బిట్ కాయిన్ కీలకం కానున్నదని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. రెనెవబుల్ ఎనర్జీకి బిట్ కాయిన్ ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు.
ఎర్త్ డే సందర్భంగా గురువారం జరిగిన ఒక చర్చావేదికలో జాక్ డోర్సీ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ‘స్క్వేర్’, గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఏఆర్కే ఇన్వెస్ట్ సంయుక్త శ్వేతపత్రం విడుదల చేశాయి.
‘భవిష్యత్ పర్యావరణ హిత ఇంధనానికి బిట్ కాయిన్ కీలకం‘ అనే పేరుతో ఈ శ్వేతపత్రం విడుదలైంది. బుధవారం జాక్ డోర్సీ ట్వీట్ చేస్తూ రెనెవబుల్ ఎనర్జీకి బిట్ కాయిన్ ప్రోత్సాహకరంగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.
దీనికి ప్రతిగా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సమాధానమిస్తూ.. వచ్చే వారం నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్లా పవర్ వాల్ బ్యాటరీతో కలిసి టెస్లా సోలార్ ప్యానెళ్లు, సోలార్ రూప్లను విక్రయిస్తామని మరో ట్వీట్ చేశారు.
‘ఈనాటి ఎనర్జీ అసెట్ ఓనర్లు రేపటి బిట్ కాయిన్ మైనర్లు‘ అని స్క్వేర్, ఏఆర్కే ఇన్వెస్ట్ తమ సంయుక్త శ్వేతపత్రంలో పేర్కొన్నాయి.
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్, వ్యాక్సినేషన్‌పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
తులం బంగారం 4 నెలల్లో రూ.50వేలకు.. పరిస్థితి విషమిస్తే.. మరింత పైపైకి!