IT Returns | గత ఆర్థిక సంవత్సరం 2021-22 (2022-23 అంచనా సంవత్సర) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) గడువులోగా దాఖలు చేయలేదా.. 2022 డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అయ్యారా.. అయినా మరో దఫా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చాన్స్ ఉంది. గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన 2022 బడ్జెట్ను ప్రవేశ పెడుతూ ఒక ఆర్థిక సంవత్సరం గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అయినవారు అప్డేటెడ్ ఐటీఆర్ (ఐటీఆర్-యూ) అదే ఏడాది ఫైల్ చేసే వెసులుబాటు కల్పించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.
వ్యక్తిగత ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు మూడు విధాలు : ఒర్జినల్ (డేట్లోపు లేదా డేట్ నాడు), బీ లేటెడ్ (డిసెంబర్ 31) లేదా రివైజ్డ్ (ఒర్జినల్ ఐటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయొచ్చు). కానీ, అప్డేటెడ్ ఐటీఆర్ లేదా ఐటీఆర్-యూ ఫైల్ చేయని వారు ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు అంటే వచ్చే మార్చి 31 లోపు ఫైల్ చేయొచ్చు. బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయని వారు రెండేండ్ల లోపు ఫైల్ చేయొచ్చు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బీ లేటెడ్ ఐఈఆర్ ఫైల్ చేయని వారు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 లోపు సబ్మిట్ చేఒచ్చు.
అయితే అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయని వారు రిటర్న్స్, ఇన్కమ్ టాక్స్ రిఫండ్ అవకాశాన్ని కోల్పోతారు. బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయని వారు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31)లో 25 శాతం అదనపు పన్ను పే చేయాలి. 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 లోపు ఫైల్ చేస్తే 50 శాతం అదనపు పన్ను చెల్లించాలి. ఇక ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఎఫ్ సెక్షన్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నెలాఖరులోగా ఐటీఆర్ ఫైల్ చేయని వారిపై రూ.5000 పెనాల్టీ పడుతుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు (రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు) రూ.1000 పెనాల్టీ పేచేసి బీ లేటెడ్ ఐటీఆర్ సమర్పించొచ్చు. ఆదాయం పన్ను చట్టం-1961లోని 139 (8ఎ) సెక్షన్ ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.