Itel Zeno 20 Max : హాంకాంగ్ కు చెందిన ఐటెల్ సంస్థ ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి ఐటెల్ జీనో 20 మ్యాక్స్ పేరుతో 4జీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. తక్కువ ధరలో ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బాగా సరిపోతుంది. ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్.
ఐటెల్ జీనో 20 మ్యాక్స్ ఫీచర్లు.. 6.6 అంగుళాల హెచ్డీ+ఐపీఎస్ డిస్ ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 3జీబీ+64జీబీ, 4జీబీ+64జీబీ, ఎక్స్ పాండబుల్ అప్ టు 8జీబీ ర్యామ్, యునిసాక్ టీ7,100 చిప్ సెట్ 13 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, 10 వాట్స్ ఛార్జర్ ఇన్ బాక్స్, డైనమిక్ బార్, ఐపీ 54 రేటింగ్, ఎంఐఎల్-ఎస్టీడీ 810 హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యురబిలిటీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్, డీటీఎస్ సౌండ్ వంటి ఫీచర్లున్నాయి. అరోరా బ్లూ, స్పేస్ టైటానియం, స్టార్లిట్ బ్లాక్ ధరల్లో లభిస్తుంది. వీటి ధరలు రూ.5,799, రూ.6,169.