Itel A80 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన ఐటెల్ ఏ80 (Itel A80) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హెచ్డీఆర్ మద్దతుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే ఈ బ్యాటరీ మూడు రోజులు పని చేస్తుంది. బ్యాటరీ స్టేటస్, నోటిఫికేషన్లు, ఇతర అలర్ట్స్ సమాచారం సమగ్రంగా తెలుసుకునేందుకు డైనమిక్ బార్ ఫీచర్ ఉంటుంది. ఐటెల్ ఏ80 (Itel A80) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999లకు లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు చేసిన వంద రోజుల్లో ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ గ్యారంటీ చూపుతుంది. ఐటెల్ ఏ80 (Itel A80) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.7- అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది. మూడు రంగులు – గ్లాసియర్ వైట్, స్టాండ్ స్టోన్ బ్లాక్, వేవ్ బ్లూ రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఒక్టాకోర్ యూనిసోక్ టీ603 చిప్ సెట్ ఉంటది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు లాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది.
ఐటెల్ ఏ80 (Itel A80) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా సెన్సర్ విత్ హెచ్డీఆర్ సపోర్ట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సె కెమెరా ఉంటుంది. రేర్ కెమెరా మాడ్యూల్ తోపాటు నోటిఫికేషన్ లైట్ ఉంటుంది.బ్యాటరీ స్టేటస్, ఇతర అలర్ట్స్ తెలుసుకోవడానికి డైనమిక్ బార్ ఉపకరిస్తుంది.
ఐటెల్ ఏ80 (Itel A80) ఫోన్ 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్, 18 గంటల వీడియో ప్లే బ్యాక్, 31 గంటల కాల్ టైం కెపాసిటీ ఉంటుంది. సిగ్నల్ స్టెబిలిటీ మెరుగుదల, బ్యాటరీ లైఫ్ పొడిగింపునకు ఆల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, స్మార్ట్ లింక్+ ఫీచర్లు ఉంటాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.