ముంబై, మార్చి 11: ఐటీసీ హోట ల్స్, నార్నే హోటల్స్ అండ్ రిసార్ట్స్ జట్టు కట్టాయి. ఓ కొత్త హోటల్ కోసం మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. కర్నాటకలోని కూర్గ్ వద్దగల మడికెరి హిల్‌టౌన్‌లో వెల్కమ్హోటల్ బ్రాండ్ కింద ఈ నూతన హోటల్‌ను తీసుకురాబోతున్నారు. ‘మాకు మడికెరి ఓ ప్రధాన మార్కెట్. గత కొన్నేండ్లుగా ఈ ప్రాంతం ఎంతో గుర్తింపును సంతరించుకుంటున్నది. అందుకే ఈ అందమైన నగరంలో వెల్కమ్హోటల్ ద్వారా ఐటీసీ హోటల్స్ ఆతిథ్యాన్ని తెస్తున్నాం’ అని సోమవారం ఓ ప్రకటనలో ఐటీసీ హోటల్స్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనీల్ చద్దా అన్నారు. కాగా, తాజా ఒప్పందంతో కర్నాటకలో ఐటీసీ హోటల్ గ్రూప్ మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని చద్దా వ్యక్తం చేశారు.