Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ar Rahman | భారతీయ సినీ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన తాజా చిత్రం ‘రామాయణం’పై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఒక కళాకారుడు చేసే ప్రతి పనిని అందరూ మెచ్చుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Ar Rahman | భారతీయ సినీ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన తాజా చిత్రం ‘రామాయణం’పై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఒక కళాకారుడు చేసే ప్రతి పనిని అందరూ మెచ్చుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ సాంకేతిక నిపుణుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటను గుర్తుచేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అందరినీ సంతృప్తి పరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోండి’ అని స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు రెహమాన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుందని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదనే భావనను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాట సంగీత శైలిపై కొందరు విమర్శలు చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ విమర్శలపై స్పందించిన రెహమాన్.. తన సంగీతానికి తానే తొలి విమర్శకుడినని చెప్పారు. ఒక పాటను రూపొందించడం వెనుక నెలల తరబడి ఆలోచన, కృషి ఉంటాయని వివరించారు. ఏదైనా నిర్ణయానికి రావడానికి తనకు సమయం పడుతుందని, ఒక్క రోజులోనే ఒక ఆలోచనను ఖరారు చేయనని స్పష్టం చేశారు.
‘రామాయణ’ కోసం భారీ స్థాయిలో సంగీతాన్ని రూపొందిస్తున్నామని రెహమాన్ వెల్లడించారు. భారతీయ వెర్షన్‌తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మరో వెర్షన్‌కు కూడా సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని పాటలు మొదటిసారి విన్నప్పుడు ఒకలా అనిపించినా, కాలం గడిచేకొద్దీ మరింతగా నచ్చుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాటలోని ఒక్క అంశాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మొత్తం సంగీతంపై నిర్ణయానికి రావద్దని సూచించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది. మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న, రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాద రహిత సింగరేణి.. నూతన కార్మిక భద్రతా నిబంధనలపై అవగాహన శిబిరం
Women | మా పిల్లలకు జాబుల్లేవ్, కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చిన మహిళ
Health Tips | షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మీ ఆహారంలో ఇవి భాగం కావాల్సిందే..!
మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
Diabetes | డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్న సెలబ్రిటీలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఢోకా ఉండదు..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

