కోల్కతా, జూలై 11: దేశీ య ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైనా ఐటీసీ పగ్గా లు మరోసారి సంజీవ్ పురికి వరించాయి. ప్రస్తు తం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ పురి మరో ఐదేండ్లపాటు ఇదే పదవిలో కొనసాగనున్నారు. మంగళవారం జరిగిన కంపెనీ వార్షిక జనరల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆయన సారథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయం రూ. 12,500 కోట్ల నుంచి రూ.19,123 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరానికిగాను ఆయన రూ.16.31 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.12.86 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.