హైదరాబాద్, మే 21: ఐటీ సొల్యుషన్ సేవల సంస్థ ఎంఫసిస్..తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(జీసీవో)ని ప్రారంభించింది. అడ్వాన్స్డ్ కంప్యూటర్ సేవలైన కృత్రిమ మేధస్సు, జెన్-ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించడానికి ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నూతన సెంటర్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు, ఇందుకోసం ప్రాంతీయంగా ఉండే ప్రతిభ కలిగిన వారిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించనున్నది.